సారంగాపూర్, వెలుగు: నిర్మల్‌జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుతం 1179.6 అడుగులు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3000 క్యూసెక్కులు వస్తుండగా రెండు గేట్లను ఎత్తి 3500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.