రామయ్యకు స్వర్ణ పుష్పార్చన

  •     శ్రీరామదూత మండపంలో రాపత్​ సేవ

భద్రాచలం,వెలుగు :  సీతారామచంద్రస్వామికి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరిగింది.   తీర్ధబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకం చేశారు. బాలబోగం నివేదన చేశారు.  కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదన జరిగింది.  

దర్బారు సేవ నిర్వహించాక స్వామిని ఊరేగింపుగా గోదావరి వంతెన సమీపంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామదూత మండపానికి రాపత్​సేవ కోసం తీసుకెళ్లారు. కోలాటాలు, భక్తుల జయజయధ్వానాలు, వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి తిరువీధి సేవగా బయలుదేరారు. పూజలందుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నారు.