భారీ వర్షం కారణంగా శ్రీశైలంలో స్వర్ణరథోత్సవ కార్యక్రమం నిలిచిపోయింది. అకాల వర్షం కారణంగా స్వర్ణరధోత్సవాన్ని నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. అయితే ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గర్భాలయంలో శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు యధావిధిగా నిర్వహించారు.
అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ఉన్న బంగారు స్వర్ణ రథం పై అధిరోహింపజేసిన శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. స్వర్ణ రథోత్సవం ఊరేగింపు నిలిచిపోవటంతో స్వర్ణరథం వద్దనే కళాకారులు కోలాటాలతో నృత్యాలు చేశారు.