స్వర్ణగిరి గుడి ఆదాయం రూ.12.49 కోట్లు

స్వర్ణగిరి గుడి ఆదాయం రూ.12.49 కోట్లు

యాదాద్రి, వెలుగు: భక్తుల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని వారికి సదుపాయాలు కల్పించడానికే ఖర్చు చేస్తామని స్వర్ణగిరి ధర్మకర్త మానెపల్లి రామారావు తెలిపారు. భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్​లో మాట్లాడుతూ గుడి ప్రారంభించిన వంద రోజుల్లోనే దాదాపు 50 లక్షల మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారన్నారు. 

తద్వారా రూ.12.49 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ మొత్తంతో పాటు భవిష్యత్​లో వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా తాము వినియోగించుకోబోమని చెప్పారు. ఆదాయాన్నంతా  భక్తులకు సదుపాయాలు కల్పించడం కోసమే ఖర్చు చేస్తామన్నారు.  ప్రతి రోజు స్వామి వారిని దర్శనం చేసుకుంటున్న  8 వేల నుంచి 10 వేల మందికి అన్నదానం చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యాల కోసం ఇప్పటికే 50 కాటేజీలు, 70 బెడ్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

భక్తులకు ఇబ్బందులకు కలగకుండా సదుపాయాలు కల్పించడం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. స్వామి వారి ఆర్జిత సేవల కోసం www.ytdtemple.com వెబ్​సైట్​లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చన్నారు. భవిష్యత్​లో టైమ్ స్లాట్ ద్వారా సేవల అందిస్తామని వెల్లడించారు. మానేపల్లి మురళీకృష్ణ, గోపికృష్ణ, శ్రవణాచార్యులు, స్థపతి డీఎన్​వీ ప్రసాద్​ ఉన్నారు.