వడదెబ్బతో మహిళ మృతి

వడదెబ్బతో  మహిళ మృతి

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) అనే వివాహిత వడదెబ్బతో మృతి చెందారు. ఇరిగేషన్ శాఖలో  ఏఈగా పనిచేస్తున్న గంగాధర్ భార్య అయిన స్వర్ణలత గత రెండు రోజుల నుంచి ఎండ దెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

చికిత్స పొందుతూనే ఆమె మరణించారు. స్వర్ణలతకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.కాగా.. గత వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 43.5 డిగ్రీల వరకు చేరుకున్నాయి. ఇప్పటికే చాలా మంది వడ దెబ్బకు గురై హాస్పిటల్స్ లో చేరారు. కాగా మృతురాలు స్వర్ణలత కు ముగ్గురు కూతుళ్లు వైష్ణవి, జయంతిక, ప్రత్యుష లు ఉన్నారు.