ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి.. ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి సెకండ్ రిలీజ్

ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి.. ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి సెకండ్ రిలీజ్

గతేడాది విడుదలై  బిగ్ సక్సెస్ సాధించిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌‌గా తెరకెక్కుతోన్న  సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. మొదటి పార్ట్ విజయంతో అంచనాల మధ్య రూపొందిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.  శనివారం రెండో పాటను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు స్వాతిరెడ్డి యూకేతో కలిసి ఎనర్జిటిక్‌‌గా పాడాడు.

‘నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి.. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి.. నీ ముద్దు పేరు బాగుందే స్వాతిరెడ్డి.. ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి.. ’ అంటూ యూత్‌‌ను అట్రాక్ట్‌‌ చేసేలా సురేష్ గంగుల రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌‌తో కలిసి రెబా మోనికా జాన్ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగ్‌‌గా ఉన్నాయి. పార్టీ మూడ్‌‌లో సాగిన ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 26న సినిమా విడుదల కానుంది.