రాజ్యసభలో .. స్వాతి మలివాల్​  ప్రమాణ స్వీకారం

రాజ్యసభలో .. స్వాతి మలివాల్​  ప్రమాణ స్వీకారం
  • మరో ఇద్దరు  సభ్యులు కూడా..

న్యూఢిల్లీ: ముగ్గురు కొత్త సభ్యులు సత్నాం సింగ్ సంధూ, నారాయణ దాస్ గుప్తా, స్వాతి మలివాల్ బుధవారం రాజ్యసభ ఎంపీ లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ వారిని అభినందించారు. నామినేటెడ్ సభ్యుడైన సంధూ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ‘‘మీరు చరిత్ర సృష్టించారు. పార్లమెంటు నూతన భవనంలో ప్రమాణస్వీకారం చేసిన మొదటి వ్యక్తి మీరే” అని సంధూకు చైర్మన్ అభినందనలు తెలిపారు.

అయితే, ప్రమాణ స్వీకారంలో భాగం కాని కొన్ని పదాలను స్వాతి మలివాల్ ఉపయోగించా రు. దీంతో ఆమె మొదటి ప్రమాణాన్ని చైర్మన్ పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఆమె రెండోసారి ప్రమాణం చేయాల్సి వచ్చింది.  చంఢీగడ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అయిన సంధూను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు.