సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపై ఉన్న భూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రతీ నెలా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు రంగాచార్య, రామకృష్ణమాచార్య, విజయ్, జయంత్ సాయి, కలకుంట్ల నచికేత్, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, మురళీ పాల్గొన్నారు.