స్వయంభూ మూవీ స్పెషల్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

స్వయంభూ మూవీ స్పెషల్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌లతో పాన్ ఇండియా వైడ్‌‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాకూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. శనివారం నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో వారియర్ గెటప్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు నిఖిల్. 

రెండు కత్తులతో, యుద్ధంలో శత్రువులను పోరాడుతున్నట్టు కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. పొడవాటి జుట్టు, మెలితిప్పిన మీసాలు, గడ్డం, కండలు తిరిగిన శరీరంతో బీస్ట్ మోడ్‌‌లో నిఖిల్ మెస్మరైజ్ చేస్తున్నాడు. 

మరోవైపు ఈ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీకి సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా కెకె సెంథిల్ కుమార్ వర్క్ చేస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ మూవీస్‌‌కు వర్క్ చేసిన సెంథిల్ తమ ప్రాజెక్టులోకి అడుగుపెట్టడం హ్యాపీ అని మేకర్స్  చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్  హైదరాబాద్‌‌లో వేసిన మ్యాసివ్ సెట్‌‌లో జరుగుతోంది.  సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.