నిర్మల్ ​ఉత్సవాలలో ‘స్వేచ్ఛకు సంకెళ్లు’ పుస్తకావిష్కరణ

నిర్మల్ ​ఉత్సవాలలో ‘స్వేచ్ఛకు సంకెళ్లు’ పుస్తకావిష్కరణ

నిర్మల్, వెలుగు: ప్రముఖ కళాకారుడు, కవి పోలీస్ భీమేశ్ రచించిన ‘స్వేచ్ఛకు సంకెళ్లు’ అనే కవితా సంపుటిని నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఇక్కడి ప్రధాన వేదికపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులు ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక అంశాలపై పోలీస్ భీమేశ్ ఇప్పటికే పలు కవితలు రచించి ప్రశంసలందుకున్నారు.

పర్యావరణహితమైన బొమ్మలు తయారు చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ గారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.