ఓటింగ్​ శా తం పెంచేలా స్వీప్ ​కార్యక్రమాలను విస్తృతం చేయాలి.. కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్

ఓటింగ్​ శా తం పెంచేలా స్వీప్ ​కార్యక్రమాలను విస్తృతం చేయాలి.. కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 18 ఏండ్లు పూర్తిచేసుకొనే యువతను ఓటరుగా నమోదు చేయించడంతో పాటు ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేలా స్వీప్ కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ జితేశ్​వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్ లోని మినీ మీటింగ్​ హాల్​లో గురువారం ఏర్పాటు చేసిన స్వీప్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో మూడు శాతం కొత్త ఓటర్ల నమోదుకు ఛాన్స్​ ఉందన్నారు. యువతకు అవగాహన కల్పించి, ఓటు నమోదు దిశగా ప్రోత్సహించాలన్నారు. మే 13న జరిగే లోక్​సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటేయాలన్నారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నా ఓటెయొచ్చని, ఈ విషయమై ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా పోలింగ్ మొదలైన మొదటి గంటలోనే భారీగా పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సహకారంతో  పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు వేయించాలన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అంబాసిడర్ల ద్వారా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రంగోలి పోటీలు నిర్వహించామన్నారు.

ప్రతి ఓటరుకు తమ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందో (ఓటర్ హెల్ప్  లైన్, ఓటర్ ఇన్ఫర్మేషన్ ​స్లిప్) తెలుసుకునేందుకు ఈ నెల 22న వాక్ టూ పోలింగ్ బూత్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈనెల 26న అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 కె రన్, 28 న గోడలపై ఓటు ప్రాముఖ్యత పై ఫొటోలు, స్లోగన్లు, పెయిటింగ్స్​వేయించనున్నట్లు తెలిపారు. థర్డ్ జెండర్స్ ​తమ ఓటును నమోదు చేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, నెహ్రూ యువ కేంద్రాలను కోరారు.