నిప్పుల కుంపటే..తెలంగాణలో ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్

నిప్పుల కుంపటే..తెలంగాణలో ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణలోని  కొన్ని జిల్లాలలో ఇవాళ అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో రాత్రి పూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

 ఈ క్రమంలోనే ఏప్రిల్ 25న తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏప్రిల్ 25న  ఉత్తర తెలంగాణ జిల్లాలలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  ఏ ప్రిల్ 25న  గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 24న  ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల  వర్షాలు కురిసే అవకాశం.శుక్రవారం కొన్ని జిల్లాలు.. శని, ఆదివారాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని పేర్కొంది..