బంపరాఫర్ : రెస్టారెంట్లు, హోటళ్లకు అప్పులు ఇస్తున్న స్విగ్గీ..

బంపరాఫర్ : రెస్టారెంట్లు, హోటళ్లకు అప్పులు ఇస్తున్న స్విగ్గీ..

స్విగ్గీ.. ఒక్క హోటల్ లేకుండా ఫుడ్ యాప్ తీసుకొచ్చిన సంస్థ.. స్విగ్గీ అంటే ఫుడ్ డెలివరీ యాప్.. ఇది తెలియని వాళ్లు ఉండరు. జస్ట్ ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ తయారీతో.. ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదిస్తుంది.. అంతేనా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ క్రమంలోనే స్విగ్గీ మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా చిన్న రెస్టారెంట్లు, హోటళ్లకు పెట్టుబడి సాయం చేయనుంది. మంచి వ్యాపారం నడుస్తూ.. విస్తరణ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు పెట్టుబడి కింద అప్పులు ఇవ్వనుంది. ఈ క్రమంలోనే స్విగ్గీ.. నాన్  బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద సేవలు అందించనుంది. 

స్విగ్గీ ఇచ్చిన ఆఫర్.. సదుపాయంతో.. దేశవ్యాప్తంగా 8 వేల రెస్టారెంట్లకు.. 450 కోట్ల రూపాయలు అందజేసింది. ఇలా ఇచ్చిన అప్పుతో ఆయా రెస్టారెంట్, హోటళ్ల యజమానులు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. స్విగ్గీకి లాభం ఏంటీ.. 450 కోట్ల రూపాయలు ఊరికే ఎందుకు ఇస్తుంది అంటారా.. ఊరికే కాదండీ.. సెక్యూరిటీ కింద షేర్లు రాయించుకుంటుంది.. వాటా తీసుకుంటుంది.. ఆస్తులు తనఖా పెట్టించుకుంటుంది.. 

ALSO READ : మై డార్లింగ్ వైఫ్.. నీకు మాటిస్తున్నా.. భార్య పుట్టినరోజున మనోజ్ ఎమోషనల్ పోస్ట్

స్విగ్గీ ఎందుకు.. బ్యాంకులు ఉన్నాయి కదా అంటే.. చిన్న రెస్టారెంట్లు, హోటళ్లకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలంటే సవాలక్ష కండీషన్స్ ఉంటాయి.. ఇవన్నీ కష్టం.. దీంతో ఆయా యాజమానులు బయట మార్కెట్ లో వడ్డీలకు తీసుకుంటూ ఉంటారు.. ఫైనాన్స్ కంపెనీల నుంచి. దీన్ని అవకాశంగా తీసుకున్న స్విగ్గీ.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కింద స్విగ్గీనే.. 8 వేల రెస్టారెంట్లకు.. 450 కోట్ల రూపాయలు అందజేసింది. 

ఎటూ ఆ రెస్టారెంట్, హోటల్ లోని ఫుడ్ ను తిరిగి స్విగ్గీ ద్వారానే డెలివరీ చేయాలి కదా.. అదేదో అక్కడే అప్పు చేస్తే సరిపోతుంది కదా అని చాలా యజమానులు అక్కడే తీసుకుంటున్నారంట.. దీనికితోడు బ్యాంక్ లో ఉన్నటువంటి కండీషన్స్ అప్లయ్ లతో పోల్చుకుంటే.. ఇక్కడే తక్కువే కదా.. సో.. స్విగ్గీ అలా ఫైనాన్స్ వ్యాపారం కూడా బాగానే చేస్తుందన్నమాట...