100 రైల్వే స్టేషన్లకు స్విగ్గీ డెలివరీ.. రైళ్ల దగ్గరకొచ్చి ఫుడ్ ఇచ్చేస్తారు..

100 రైల్వే స్టేషన్లకు స్విగ్గీ డెలివరీ.. రైళ్ల దగ్గరకొచ్చి ఫుడ్ ఇచ్చేస్తారు..

న్యూఢిల్లీ: రైళ్ల దగ్గరకొచ్చి ఫుడ్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ, ఈ సర్వీస్‌‌లను 20 రాష్ట్రాల్లోని 100 రైల్వే స్టేషన్లకు విస్తరించింది. ఇందుకోసం  ఐఆర్‌‌‌‌సీటీసీతో కలిసి పనిచేస్తోంది.  రానున్న నెలల్లో మరిన్ని  రైల్వే స్టేషన్లకు సర్వీస్‌‌లను విస్తరిస్తామని ప్రకటించింది. ‘ రైల్వే ప్రయాణాలు మన కల్చర్‌‌‌‌లో భాగమయ్యాయి. ఇందులో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తోంది.  ‘ట్రైన్స్​లో ఫుడ్ డెలివరీ’ సర్వీస్‌‌లను ఇండియాలోని 100 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీంతో దేశం మొత్తం మీద ఉన్న వివిధ రకాల ఫుడ్ ఐటెమ్స్​ను ప్రయాణికులకు డెలివరీ చేయడానికి వీలుంటుంది’ అని స్విగ్గీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ దీపక్ మాలూ పేర్కొన్నారు.