ఫేమస్ ఫుడ్ డెలివరీ కంపెనీ Swiggy తన ఉద్యోగుల్లో దాదాపు 7శాతం మందిని తొలగించేందుకు సిద్ధమైంది. కస్టమర్ కేర్ విభాగంలోని టెక్నికల్ టీంలకు చెందిన 400 మంది ఉద్యోగులను తొలగిస్తు్న్నట్లు ప్రకటించింది.ఈ ఏడాదిలో ఇదే మొదటిది కాగా.. Swiggy గతేడాది (2023)జనవరిలో 380 మంది ఉద్యోగులను తొలగించింది.దాదాపు 6వేల మంది ఉద్యోగులు ఉన్న బెంగళూరుకు చెందిన Swiggy ..కంపెనీ నిర్వహణ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు Swiggy వర్గాలు తెలిపాయి.
మరో వైపు ఈ -కామర్స్ జైంట్ ఫ్లిప్ కార్టు కూడా తన వర్క్ ఫోర్స్ లో 5శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం ఐపీవో కోసం సిద్ధమవుతోంది.
ఐపీవో సంసిద్ధతను పెంచుకునేందుకు వివిధ రంగాల్లో చురుకుగా పనిచేస్తోంది. ఇందులో కార్పొరేట్ గవర్నెన్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఆప్టిమైజ్, ఉద్యోగుల తగ్గింపులను చేపడుతోంది.