జోక్​గా ఛాలెంజ్ చేస్తే.. ఫ్రీగా సరుకులు వచ్చినయ్..యూజర్​కు పంపిన స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్

జోక్​గా ఛాలెంజ్ చేస్తే..  ఫ్రీగా సరుకులు వచ్చినయ్..యూజర్​కు పంపిన స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్

న్యూఢిల్లీ: స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్‌‌లో మనం ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఓ కొత్తిమీర కట్టను కూడా ఫ్రీగా పంపుతుంటారు. అయితే, గోపేశ్ ఖేతన్ అనే ఓ యూజర్‌‌‌‌ ఈ విషయంపై సరదాగా ఎక్స్‌‌లో ఓ పోస్ట్‌‌ పెట్టాడు. ‘కొత్తిమీర పంపుడు కాదు, తాకత్‌‌ ఉంటే నెలకు సరిపడా సరుకులు పంపు’ అని చాలెంజ్ చేశాడు. 

ఖాళీగా ఉన్న తన ఇంట్లోని ఫ్రిజ్ ఫొటోను కూడా ఆయన షేర్ చేశాడు. దీనికి ఇన్‌‌స్టామార్ట్ తక్షణమే స్పందిస్తూ.. పెన్ను, నోట్​బుక్‌‌తో రెడీగా ఉన్నాం. చెప్పండి సార్ ఏమేం పంపించమంటారు..’ అని రిప్లయ్‌‌లో అడిగింది. ఏదో అలా రిప్లయ్‌‌ ఇచ్చారుగానీ పంపేంత సీన్‌‌ లేదులే అని ఖేతన్‌‌ లైట్ తీస్కున్నడు. 

అయితే, కాసేపట్లోనే సరుకులతో వచ్చిన డెలివరీబాయ్‌‌ను చూసి ఖేతన్‌‌ ఆశ్చర్యపోయాడు. చిప్స్, నూడుల్స్, పీనట్స్, నాచోస్, రూఅఫ్జా బాటిల్ వంటి స్నాక్స్ తో ఉన్న బ్యాగ్ పంపించారంటూ ఫోటో షేర్ చేస్తూ ఇన్​స్టామార్ట్​కు ఖేతన్ థ్యాంక్స్ చెప్పాడు.