వరల్డ్ కప్ లో టీమిండియా న్యూజిలాండ్ పై గెలిచి 12 ఏళ్ళ తర్వాత వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు వెళ్ళింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా కివీస్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగితే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షేర్ చేసిన పోస్ట్ క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.
ల్యాప్‌టాప్ స్క్రీన్ ఫ్రేమ్‌లో టీమిండియాను చూపిస్తూ కీబోర్డ్ వెనుక మిరపకాయలు, నిమ్మకాయలు ఉన్నాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ముందు 15 నిమిషాల ముందు ఈ చిత్రాన్ని పోస్ట్ చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఈ పోస్ట్ 50,000 కంటే ఎక్కువ మందిని ఆకర్షించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ జై కొట్టారు. క్రికెట్ ఆటను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ఈ పోస్ట్ సూచిస్తుంది.
also read :- AUS vs RSA: సఫారీలను బెంబేలిస్తున్న స్టార్క్, హేజిల్ వుడ్.. 24 పరుగులకే 4 వికెట్లు
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కు టీమిండియాకు ఒక చిన్న అనుబంధం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించడంతో స్విగ్గి డెలివరీ బాయ్స్ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియాకు విషెస్ చెప్పడం హైలెట్ గా మారింది.
Taking extra measures ?#INDvsNZ pic.twitter.com/1yWAoLsN6T
— Swiggy Instamart (@SwiggyInstamart) November 15, 2023