Swiggy: ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీస్.. `

Swiggy: ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీస్.. `

స్విగ్గీ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇవాళ రేపు ఫోన్ వాడే ప్రతిఒక్కరి ఫోన్లో ఉంటుంది ఈ ఫుడ్ డెలివరీ యాప్. మొదట్లో ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకున్న ఫుడ్ డెలివరీ యాప్స్.. ఇప్పుడు డెలివరీ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్ పేరుతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి.. ఫలితంగా యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో స్విగ్గీ కొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది. బోల్ట్ అనే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫుడ్ ని 10నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేయనుంది స్విగ్గీ.

ALSO READ | Good News : అమెజాన్ నుంచి గోల్డ్ వోచర్స్

బోల్ట్ సర్వీస్ ద్వారా 2కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ నుండి బర్గర్స్, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్, బిర్యానీ వంటి తక్కువ ప్రిపరేషన్ టైమ్ ఉండే ఐటమ్స్ ను 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. ఈ సర్వీస్ ను మొదట ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో స్టార్ట్ చేసి తర్వాత దేశమంతటా విస్తరించనుంది స్విగ్గీ. ప్రాస్తుతం సగటున 30నిమిషాలుగా ఉన్న డెలివరీ టైమ్ బోల్ట్ సర్వీస్ తో 10నిమిషాలకు తగ్గనుంది.