కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు

కోటీశ్వరులైన 500 మంది స్విగ్గీ ఉద్యోగులు

స్విగ్గీ బుధవారం స్టాక్​మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో 500 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్‌‌‌‌లో చేరారు. ఈ 500 మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ (ఈసాప్​)​లను గతంలోనే కేటాయించారు. 

స్విగ్గీ షేర్లు బుధవారం ఇష్యూ ధర రూ. 390 నుంచి దాదాపు 17 శాతం ప్రీమియంతో ముగిశాయి.  బీఎస్‌‌‌‌ఈలో ఇష్యూ ధర నుండి 5.64 శాతం జంప్‌‌‌‌ చేసి షేరు రూ.412 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 19.30 శాతం పెరిగి రూ.465.30కి చేరుకున్నాయి.  ఎన్​ఎస్​ఈలో స్విగ్గీ షేర్లు 7.69 శాతం జంప్‌‌‌‌తో రూ. 420 వద్ద మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశించాయి. ఈ షేరు 16.92 శాతం లాభంతో రూ.456 వద్ద ముగిసింది.   కంపెనీ మార్కెట్ విలువ రూ.1,02,062.01 కోట్లు ఉంది.