
జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి తెలియనివారు ఉండరు. వంటింట్లో వండడం మానేసి.. యాప్ లో ఆర్డర్ చేయటానికి అలవాటు పడ్డారు సిటీ జనం. ఆకలిగా లేకపోయినా ఫుడ్ డెలివరీ యాప్ నోటిఫికేషన్ చూసి టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి ఆర్డర్ చేసే రేంజ్ అడిక్ట్ అయ్యారు జనం.
ఫుడ్ డెలివరీ యాప్ నోటిఫికేషన్స్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు.నోటిఫికేషన్స్ తో విసిగిపోయిన చాలామంది యాప్ ని అన్ ఇన్స్టాల్ కూడా చేసేస్తుంటారు. ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ. రంజాన్ లాంటి పండగల సమయాల్లో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ.
ఫాస్టింగ్ మోడ్ ప్రత్యేకత ఏంటి:
రంజాన్, దసరా లాంటి పండగల సమయాల్లో ఉపవాసం ఉండేవారి కోసం ప్రత్యేకంగా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది స్విగ్గీ.
రంజాన్ సమయంలో ఉపవాసం ఉండేవారు ఈ ఆప్షన్ ని ఆన్ చేస్తే.. తెల్లవారు జాము నుంచి సాయంత్రం 4 గంటల తర్వాత ఉపవాసం ముగిసే వరకు యాప్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రావు. తిరిగి ఉపవాస సమయం ముగిసాక.. యూజర్లు ఆఫ్ చేయకుండానే ఈ ఫీచర్ ఆఫ్ అయ్యి.. రంజాన్ స్పెషల్ ఫుడ్స్ పై ఉన్న ఆఫర్స్, స్పెషల్ డిషెస్ తో కూడిన నోటిఫికేషన్స్ వస్తాయి.
దసరా, దీపావళి, లాంటి ఇతర పండగల సమయాల్లో కూడా ఫాస్టింగ్ మోడ్ ఫీచర్ ఇలాగే పని చేస్తుంది. ఏదేమైనా స్వగ్గీ ఐడియా సూపర్ గా ఉందనే చెప్పాలి.. ఫాస్టింగ్ సమయాల్లో యాప్ ని అన్ ఇన్స్టాల్ చేయకుండా ఉండటంతో పాటు ఉపవాస సమయం ముగిసాక స్పెషల్ ఆఫర్స్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా ఉంది ఫాస్టింగ్ మోడ్.
ALSO READ | టీడీపీ ఎంపీ బంపరాఫర్ : మూడో బిడ్డకు 50 వేలు.. అబ్బాయి అయితే ఆవు, దూడ