న్యూఢిల్లీ: విదేశాల్లో ఉండేవారు ఇండియాలోని తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. ‘ఇంటర్నేషనల్ లాగిన్’ ఫీచర్‌తో యూఎస్, జర్మనీ, కెనడా, యూకేలలో నివసిస్తున్నవారు ఇండియాలో ఉంటున్నవారి కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. దీంతో పాటు కంపెనీకి చెందిన క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ ద్వారా షాపింగ్ కూడా చేయొచ్చు. డైనింగ్ కోసం రెస్టారెంట్లలో టేబుల్స్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్స్‌తో పేమెంట్స్ పూర్తి చేయడానికి వీలుంది.
ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్‌తో విదేశాల్లో ఉంటున్నవారు తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. ఇలాంటి ఫీచర్‌ను తేవాలని ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ యూజర్లు కోరుతున్నారు. ఫెస్టివ్ సీజన్ టైమ్‌లో దీన్ని తీసుకొచ్చాం’ అని స్విగ్గీ ఫౌండర్ ఫణి కిషన్ పేర్కొన్నారు. కాగా, స్విగ్గీ ఐపీఓకి రావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు రూ.10 వేల కోట్లను సేకరించాలని ఈ కంపెనీ చూస్తోంది.