స్విగ్గీ కొత్త ఆఫర్..ప్రతీ సిక్స్ కు 66 శాతం డిస్కౌంట్

స్విగ్గీ కొత్త ఆఫర్..ప్రతీ సిక్స్ కు  66 శాతం డిస్కౌంట్
  • సిక్స్​ కొడితే డిస్కౌంట్​
  • స్విగ్గీ సిక్సెస్  ​ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: క్రికెట్​ ప్రేమికుల కోసం సిక్సెస్​ పేరుతో స్విగ్గీ కొత్త ఆఫర్​ను తీసుకొచ్చింది.  ఐపీఎల్​ మ్యాచ్​లో క్రికెటర్​ సిక్స్​ కొట్టిన వెంటనే కస్టమర్​ మొబైల్​ యాప్​లో కూపన్​​ యాక్టివేట్ ​అవుతుంది. ఇది పది నిమిషాలు అందుబాటులో ఉంటుంది. ఈలోపే ఆర్డర్ ​ఇవ్వాలి. స్విగ్గీ సిక్స్‌‌‌‌‌‌‌‌తో, వినియోగదారులు దేశ వ్యాప్తంగా 50వేలకుపైగా రెస్టారెంట్ల నుంచి డిస్కౌంట్లను దక్కించుకోవచ్చు. ధరలను 66శాతం వరకు తగ్గిస్తామని స్విగ్గీ తెలిపింది.