మంజీరా నదిలో చిక్కుకున్న పశువుల కాపర్లు

మంజీరా నదిలో చిక్కుకున్న పశువుల కాపర్లు

బోధన్​, వెలుగు: బోధన్​ మండలం మందర్నా గ్రామ సమీపంలోని మంజీర నదిలో శివరాజ్, చందు, ప్రకాశ్ అనే ముగ్గురు పశువుల కాపర్లు గురువారం ఉదయం పశువులను మేపడానికి వెళ్లి వరదలో చిక్కుకుపోయారు. సాయంత్రం తిరిగి రాలేకపోవడంతో మంజీర నదిలో చిక్కుకున్నట్లు కాపరులు సెల్‌‌‌‌ఫోన్  ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు. బోధన్​రూరల్​సీఐ నరేశ్, ఎస్ఐ నాగనాథ్, హుటాహుటిన మంజీర నది వద్దకు వెళ్లి మహారాష్ట్రలోని యేసిగి గ్రామం నుంచి గజ ఈతగాళ్లును పిలిపించి పశువుల కాపరులను రక్షించారు.  

గ్రామస్తులు మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మంజీర నది సమీపంలోని మన్నాడు వాగు, లెండీ నిండుగా పారడంతో పశువుల కాపరులు మంజీరలో చిక్కుకుపోయారని చెప్పారు. గ్రామస్తులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో పశువుల కాపరులు ప్రాణాలతో బయడపడ్డారు. దీంతో పశువుల కాపరులు కుటుంబసభ్యులు, గ్రామస్తులు 
ఉపీరిపీల్చుకున్నారు.