హైదరాబాద్, వెలుగు: ఐదో సీజన్ హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (హెచ్‌పీజీఎల్)లో సింథోకెమ్ స్వింగ్ కింగ్స్ దూసుకెళ్తోంది. వూటీ గోల్ఫ్ కోర్సులో జరిగిన మూడో రౌండ్ పోటీల్లో స్వింగ్ కింగ్స్ జట్టు గ్రూప్–ఎలో సత్తా చాటింది. ఈ రౌండ్‌లో 150 పాయింట్లు కైవసం చేసుకొని మొత్తంగా 527 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది.
గ్రూప్–బిలో మీనాక్షి మేవరిక్స్ టీమ్ ఆకట్టుకుంది. మొత్తంగా 505 పాయింట్లతో తన గ్రూప్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గ్రూప్–సిలో యాంగ్రీ బర్డ్స్ టీమ్ మూడో రౌండ్‌లో 148 పాయింట్లు కైవసం చేసుకుంది. ఏజైల్ డర్టీ డజన్స్ జట్టు కాస్త తడబడినా ఓవరాల్‌గా 518తో 381 పాయింట్లతో గ్రూప్-–డిలోఅగ్రస్థానంలో కొనసాగుతోంది.