
బాసెల్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. స్విస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో నిరాశపర్చింది. బుధవారం రాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లోనే సింధు 17–21, 19–21తో జూలీ జాకబ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడింది. మరో మ్యాచ్‌లో అనుపమ ఉపాధ్యాయ 21–14, 21–13తో అన్మోల్ ఖర్బ్‌పై నెగ్గింది. మెన్స్ సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ 21–10, 21–11తో కుయెంజి (స్విట్జర్లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–5, 21–16తో అండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. కిరణ్ జార్జ్ 21–18, 17–21, 10–21తో రాస్మస్ గిమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడాడు.