టైటానియం, సిట్రిక్ యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్ .. 12 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ పట్టివేత

టైటానియం, సిట్రిక్ యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్ .. 12 క్వింటాళ్ల కల్తీ పేస్ట్ పట్టివేత

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో 12 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ని ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. నాంపల్లిలోని అగాపురాకు చెందిన మహమ్మద్ అఫ్తాబ్.. రామంతాపూర్ కేసీఆర్ నగర్ లోని బాలకృష్ణ నగర్ లో ప్లాట్ నంబర్ 5 లో పదేండ్లుగా న్యూ నేషనల్ అనే పేరుతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. కుళ్లిన ఆలుగడ్డలు, అరటి చెట్టు కాండం, టైటానియం కెమికల్, సిట్రిక్ యాసిడ్ (మోనోహైడ్రేట్) కలిపి పేస్టు తయారు చేసి అమ్ముతున్నాడు. ఎస్​వోటీ పోలీసులు ఇప్పటికే ఇతడిని మూడు సార్లు అదుపులోకి తీసుకున్నారు.

 సాధారణ కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తుండడంతో బయటకు వచ్చి మళ్లీ అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాలుగోసారి పట్టబడంతో మల్కాజ్​గిరి ఎస్​వోటీ పోలీసులు అతన్ని అరెస్ట్​చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న సదరు నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, పీడీ యాక్ట్​ పెట్టాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.