యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఐస్ క్రీం తయారీ యూనిట్ పై ఎస్వోటీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. శుభ్రత పాటించకుండా పలు రకాల ఐస్ క్రీంలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఐస్ క్రీం తయారీ యూనిట్ ను నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఎలాంటి లేబెలింగ్ లేని ఐస్ క్రీం కవర్లు, కప్పులు, ఐస్ క్రీం ఫ్లేవర్ లిక్విడ్ బాటిళ్లను సీజ్ చేసినట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు.