కౌలు రైతుల హామీలు నెరవేర్చాలి .. సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్

కౌలు రైతుల హామీలు నెరవేర్చాలి .. సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. మంత్రివర్గ సమావేశంలో వీటిపై స్పష్టమైన హమీలు ఇవ్వాలని కోరింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక నాయకుడు విస్సా కిరణ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. 

తొలి ఏడాది రైతుల కోసం రికార్డు స్థాయిలో రూ.54 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో ఒక శాతం కూడా కౌలు రైతులకు దక్కలేదన్నారు. సాగుదారుల చట్టం అమలు చేసి, కౌలు రైతులందరినీ గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతోందని హెచ్చరించారు.