T20 World Cup 2024: బౌండరీ దగ్గర విన్యాసం.. ఎంగెల్‌బ్రెచ్ట్ సూపర్ మ్యాన్ ఫీల్డింగ్

T20 World Cup 2024: బౌండరీ దగ్గర విన్యాసం.. ఎంగెల్‌బ్రెచ్ట్ సూపర్ మ్యాన్ ఫీల్డింగ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్  టీ20 వరల్డ్ కప్ లో నమోదయింది. 

వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) శ్రీలంక, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ఆటగాడు సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ అద్భుత ఫీల్డింగ్ తో ఔరా అనిపించాడు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 17 ఓవర్ రెండో బంతిని టిమ్ ప్రింగిల్ ఫుల్ టాస్ వేశాడు. శ్రీలంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ఈ బంతిని సిక్సర్‌కి లాగేందుకు ప్రయత్నించాడు. మిడ్ వికెట్ మీదుగా కొట్టిన ఈ బంతిని ఎంగెల్‌బ్రెచ్ట్ బౌండరీ దగ్గర సూపర్ మ్యాన్ ను తలపించాడు. గాల్లోకి అమాంతం ఎగిరి బంతిని ఆడమే కాదు.. తనను నియంత్రించుకొని వెంటనే బంతిని వెనక్కి వేశాడు. 

సైబ్రాండ్ రెప్పపాటులో చేసిన ఈ ఫీల్డింగ్ తో 5 పరుగులు సేవ్ అయ్యాయి. ఈ డచ్ ప్లేయర్ పట్టిన ఈ క్యాచ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో  సైబ్రాండ్ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరిచారు. కాగా.. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 83 పరుగుల తేడాతో శ్రీలంకపై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 118 పరుగులకే ఆలౌటైంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)