న్యూ ఇయర్ కి సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్.. పండగ చేస్కోండి.

న్యూ ఇయర్ కి సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్.. పండగ చేస్కోండి.

కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఇప్పుడంటే యూత్ రొమాన్స్, స్పెషల్ సాంగ్స్, రస్ట్ లవ్ జోనర్ ఫిలిమ్స్ ని ఇష్టపడుతున్నారు కానీ ఒకప్పుడు ప్యూర్ లవ్, నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, మోటివేషనల్ జోనర్ ఫిలిమ్స్ ని బాగా లైక్ చేసేవారు. ఈ క్రమంలో వచ్చిన ఓయ్, సై సినిమాలు మ్యూజికల్ గా, కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలు, కామెడీ సన్నివేశాలు చాలామంది ఫెవరెట్ లిస్ట్ లో ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాల్ని న్యూ ఇయర్ సందర్భగా జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.

ఓయ్ సినిమాలో లవర్ బాయ్ సిద్దార్థ్ హీరోగా నటించగా బేబీ షామిలీ హీరోయిన్ గా నటించింది. లవ్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో వెటరన్ డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని 176 బీచ్ హౌస్ లో, అనుకోలేదేనాడు, తదితర పాటలు యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినవారు ఇప్పుడు మళ్ళీ 4కే వెర్షన్ లో చూడొచ్చు.

సై సినిమాకి ప్రముఖ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో స్టార్ హీరో నితిన్ హీరోగా నటించగా జెనీలియా హీరోయిన్ గా నటించింది. ప్రదీప్ రావత్ సింగ్(భిక్షు యాదవ్), శశాంక్, తనికెళ్ళ భరణి, అజయ్, రాజీవ్, చంద్రశేఖర్ వేణుమాధవ్(దివంగత నటుడు) తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. రగ్బీ గేమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని వేణుమాధవ్ కామెడీ సీన్స్ కి డెఫినెట్ గా నవ్వకుండా అందలేరు. మంచి మోటివేషన్ తో న్యూ ఇయర్ ఐ మొదలు పెట్టాలనుకునేవాళ్లకి ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.