లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్స్ పీవీ సింధు, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధు బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 21–-17, 21–-15తో యంగ్ షట్లర్ అన్మోల్ ఖర్బ్‌పై విజయం సాధించింది.
ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ మాళవిక బన్సొద్ 21–-16, 21–-7తో విక్టోరియా డబ్జిన్స్‌కాపై నెగ్గగా, అనుపమ ఉపాధ్యాయ 19–-21, 22–-20, 21–-15తో అజర్‌బైజాన్‌కు చెందిన కైషా ఫాతిమా అజాహ్రాపై గెలిచింది. ఉన్నతి హుడా 21-–12, 21-–16తో థాయ్‌లాండ్‌కు చెందిన తమోన్వాన్ ను ఓడించింది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21–-12, 21-–12తో మలేసియా క్వాలిఫయర్ షోలే ఐడిల్‌ను వరుస గేమ్స్ లో ఓడించాడు. మూడో సీడ్ కిరణ్ జార్జ్ 21-–12, 23–-21తో అలప్ మిశ్రాపై, ఆయుష్ 21–-18, 15–-21, 21–-16తో రఘుపై గెలిచారు.