- రేపు మధ్యప్రదేశ్‌తో టైటిల్ ఫైట్
బెంగళూరు : సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అజింక్యా రహానె (56 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 98) మరోసారి రెచ్చిపోయాడు. తన శైలికి భిన్నంగా బరోడా బౌలర్లను ఉతికేశాడు. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. ముంబైని ఫైనల్ తీసుకెళ్లాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (46) కూడా రాణించడంతో.. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాపై నెగ్గింది. టాస్ ఓడిన బరోడా 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది.
శివాలిక్ శర్మ (36 నాటౌట్) టాప్ స్కోరర్. హార్దిక్ పాండ్యా (5) ఫెయిలయ్యాడు. సూర్యాన్షు 2 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై 17.2 ఓవర్లలో 164/4 స్కోరు చేసి గెలిచింది. పృథ్వీ షా (8) విఫలమైనా.. రహానె, శ్రేయస్ రెండో వికెట్‌కు 88 రన్స్ జోడించారు. రహానెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో సెమీస్‌లో మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి ఫైనల్లోకి వెళ్లింది.
ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 146/5 స్కోరు చేసింది. తర్వాత ఎంపీ 15.4 ఓవర్లలో 152/3 స్కోరు చేసింది. రజత్ పటీదార్ (66 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్ (46 నాటౌట్) రాణించారు. పటీదార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం ముంబై, ఎంపీ మధ్య ఫైనల్ జరుగుతుంది.