రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో రైల్వేస్ యంగ్‌స్టర్ అశుతోష్ శర్మ 11 బాల్స్‌లోనే ఫిఫ్టీ కొట్టి టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బ్రేక్ చేశాడు. దాంతో రాంచీ వేదికగా మంగళవారం చిన్న జట్టు అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో రైల్వేస్ 127 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ 20 ఓవరర్లలో 246/5 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో అరుణాచల్ 119 రన్స్‌కే ఆలౌటైంది.
రైల్వేస్ ఇన్నింగ్స్‌లో ఇండియా–ఎ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ (51 బాల్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 నాటౌట్), అశుతోష్ (12 బాల్స్‌లో 1 ఫోర్, 8 సిక్సర్లతో 53 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఇండియన్‌గా అశుతోష్ రికార్డు సృష్టించాడు. 2007 వరల్డ్‌కప్‌లో యువరాజ్ 12 బాల్స్‌లో (ఇంగ్లండ్‌పై) చేసిన ఫిఫ్టీ రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ.
ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో నేపాల్ క్రికెటర్ దీపేంద్ర ఐరీ 9 బాల్స్‌లోనే 50 రన్స్‌తో రికార్డుకెక్కాడు.కాగా, జైపూర్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ జట్టును ఓడించింది.