ఢాకా: బంగ్లాదేశ్ కొత్త చీఫ్‌జస్టిస్ (సీజే) గా సయ్యద్ రఫాత్ అహ్మద్ ప్రమాణం చేశారు. ఆదివారం ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రెసిడెంట్ అధికారిక నివాసంలోని దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో 25వ సీజేగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ కు చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న మహమ్మద్ యూనస్, ఢాకా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డాక్టర్ మక్సూద్ కమల్, బంగ్లా అకాడమీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ హరున్ ఉర్ రషీద్ అస్కారీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అంతక ముందు నిరసనకారులు అల్టిమేటం జారీ చేయడంతో సీజే పదవి నుంచి ఒబైదుల్ హసన్ వైదొలిగారు. ఆయనతో సహా ఐదుగురు ఇతర జడ్జిలు శనివారం తమ రాజీనామాలను సమర్పించారు. ఒబైదుల్ హసన్ రాజీనామా చేసిన మరుసటి రోజే సీజేగా సయ్యద్ రఫాత్ ప్రమాణ స్వీకారం చేశారు.