బక్రీద్ స్పెషల్: వామ్మో.. ఈ మేక ధర రూ.7లక్షలు

బక్రీద్ స్పెషల్: వామ్మో.. ఈ మేక ధర రూ.7లక్షలు

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గొర్రెలు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి ముస్లింలు బారులు తీరుతున్నారు. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే బక్రీద్ సందర్భంగా వీటి రేట్లు రెట్టింపు అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో గొర్రెలు, మేకల రేట్లు రికార్డుస్థాయిలో పలుకుతున్నాయి. 

ఒక్కో మేక రూ.50,000 నుంచి రూ.7లక్షల 50వేల వరకు పలుకుతుంది. తాను పెంచిన రాఫ్తార్ అనే ఓ మేకను రూ.7 లక్షలలకు విక్రయించినట్లు సయ్యద్ షాదబ్ అలీ తెలిపారు. దీని బరువు 155 కేజీలు. అలాగే షాన్-ఎ- భోపాల్ అనే మరో మేకను రూ.4 లక్షలకు అమ్మారు. ముంబై, పూణె, నాగ్‌పూర్, రత్నగిరి, అహ్మదాబాద్, సూరత్, భరూచ్, రాజ్‌కోట్ వంటి నగరాలకు గొర్రెలు, మేకలను అమ్ముతుంటానని వారు తెలిపారు. సాధారణ రోజుల కంటే బక్రీద్ నాడు వాటికి మంచి డిమాండ్ ఉంటుందని పెంపకపుదారుల అంటున్నారు.