ఒమిక్రాన్ ఎఫెక్ట్ మూడ్రోజులే

హైదరాబాద్, వెలుగు: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ తీవ్రత చాలా తక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ సోకిన వారం తర్వాత హెల్త్ కండీషన్ సీరియస్ అయితే.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ తో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వీక్‌‌‌‌‌‌‌‌లోనే సర్ది, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సింప్టమ్స్ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి. సింప్టమ్స్ మొదలైన నాటి నుంచి మూడ్రోజుల పాటు  సర్ది, దగ్గు, జ్వరం, తలనొప్పి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మెజారిటీ బాధితుల్లో నాలుగో రోజు నుంచి అవన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తంగా వారం రోజుల్లోనే వైరస్ నుంచి దాదాపుగా కోలుకుంటున్నారు. బాడీ పెయిన్స్, వీక్‌‌‌‌‌‌‌‌నెస్ వంటి సింప్టమ్స్ మాత్రమే వారం తర్వాత కూడా కొంతమందిలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో థర్డ్‌‌‌‌‌‌‌‌ వేవ్ పీక్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కరోనా సింప్టమ్స్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నారు. ఈసారి చాలా మంది టెస్టులకు దూరంగా ఉంటుండడంతో కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. డోలో, సిట్రిజన్, అజిత్రోమైసిన్, విటమిన్ ట్యాబ్లెట్లతోనే ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకుంటున్నారు. టెస్టు చేయించుకుని పాజిటివ్ వచ్చినవాళ్లు, చేయించుకోని వాళ్లూ ఇవే మందులు వాడుతున్నారు. కొంతమంది అవి కూడా వాడకుండానే వైరస్‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకుంటున్నారు.  

వాస్తవానికి కేసులు ఎక్కువే.. 

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ తీవ్రత తక్కువున్నప్పటికీ, వేగంగా వ్యాపిస్తోంది. అధికారికంగా చూపించే కరోనా కేసులు 4 వేలే ఉన్నప్పటికీ, అనధికారికంగా రోజూ 20 వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 56,466 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, కేసుల సంఖ్యతో పోలిస్తే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ అయ్యే వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ అన్నింటిలో కలిపి రోజూ రెండొందలకు మించి అడ్మిషన్లు జరగడం లేదు. వీరు కూడా అన్‌‌‌‌‌‌‌‌కంట్రోల్డ్‌‌‌‌‌‌‌‌ షుగర్, బీపీ, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారే. నార్మల్ హెల్త్ కండీషన్‌‌‌‌‌‌‌‌లో ఉండి హాస్పిటలైజ్డ్ అయ్యే కేసులు చాలా అరుదుగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘‘ఇప్పుడు హాస్పిటళ్లలో అడ్మిట్ అవుతున్నవాళ్లంతా ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవాళ్లే. హెల్దీగా ఉండేవాళ్లు ఎవరూ హాస్పిటళ్లలో చేరేంత సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఇన్ఫెక్ట్ కావడం లేదు. వేరే ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ల కోసం వచ్చి, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్ అవుతున్నారు. సర్జరీలు, ఇతర ప్రొసీజర్లకు ముందు రొటీన్‌‌‌‌‌‌‌‌గా చేసే టెస్టులో పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా బయటపడుతోంది. దీంతో వారిని గాంధీకి రిఫర్ చేస్తున్నారు. చాలా మంది ఇలాంటి పేషెంట్లే ఉన్నారు. కొన్ని యాక్సిడెంట్ కేసులు, ప్రెగ్నెంట్ కేసులు ఉన్నాయి”అని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రాజారావు చెప్పారు. 

ఒమిక్రాన్ డిఫరెంట్.. 

డెల్టా వేరియంట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఒమిక్రాన్ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంది. డెల్టా సోకిన వారం తర్వాత వైరల్ లోడ్ పెరిగితే, ఒమిక్రాన్ సోకిన వారిలో ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌లోనే వైరల్ లోడ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటోంది. అందుకే జ్వరం, దగ్గు, తలనొప్పి వంటివి మొదట్లో ఎక్కువగా ఉంటున్నాయి. నాలుగు, ఐదో రోజు వరకు తగ్గిపోతున్నాయి. ఇనీషియల్‌‌‌‌‌‌‌‌ డేస్‌‌‌‌‌‌‌‌లో లోడ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, డెల్టా వేరియంట్ చేసినట్టుగా ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ ఊపిరితిత్తులను డ్యామేజ్ చేయట్లేదు. గొంతు దగ్గరే సెల్ఫ్ డిస్ట్రాయ్ అవుతోంది. ఇలా ఎందుకు అవుతోందని చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఏమీ లేవు. ఈ వేరియంట్ నేచరే అలా ఉంది.
- డాక్టర్ కిరణ్ మాదాల, అసోసియేట్ 
  ప్రొఫెసర్, నిజామాబాద్ గవర్నమెంట్  మెడికల్ కాలేజీ

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌‌ తీవ్రత చాలా తక్కువగా ఉంది. డెల్టా వేరియంట్ సోకిన వారం తర్వాత హెల్త్ కండీషన్ సీరియస్ గా మారేది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ తో ఫస్ట్‌‌ వీక్‌‌లోనే సర్ది, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సింప్టమ్స్ కన్పిస్తున్నాయి.  మూడ్రోజుల పాటు ఈ లక్షణాలు ఉండి  నాలుగో రోజు నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తంగా వారం రోజుల్లోనే వైరస్ నుంచి దాదాపుగా కోలుకుంటున్నారు. బాడీ పెయిన్స్, వీక్‌‌నెస్ వంటి సింప్టమ్స్ మాత్రమే వారం తర్వాత కూడా కొంతమందిలో ఉంటున్నాయి.