అల్లం.. వెల్లుల్లి పేస్టులో సింథటిక్ రంగులు కలుపుతున్నారు..

హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.  కాటేదాన్ లో  నకిలీ అల్లం... వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో  ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు.  నియమాలకు విరుద్దంగా.. ఎలాంటి అనుమతి లేకుండా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.  ఇందులో నిర్వాహకులు సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఉమానీ ఫుడ్స్,   SKR  ఫుడ్స్ లో 1400 కిలోల అల్లం.. వెల్లుల్లి పేస్ట్ తో పాటు 50 కిలోల సింథటిక్ ఫుడ్ కలర్స్ ను సీజ్ చేశారు.  ఇంకా తయారీ కేంద్రాల్లో  అపరిశుభ్రవాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.