
హైదరాబాద్, వెలుగు: ఇంటర్‌కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సిరియా విజయం సాధించింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషన్‌ను ఓడించింది. మారిషస్ ప్లేయర్ బ్రెండన్ సిటోరా 32వ నిమిషంలో చేసిన సెల్ఫ్ గోల్‌తో సిరియా ఖాతా తెరిచింది.
70వ నిమిషంలో మవాస్ ఆ జట్టుకు మరో గోల్ అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వివిధ ఈవెంట్లు నిర్వహించడం సంతోషకరమన్నారు. కాగా, సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో సిరియాతో ఇండియా పోటీ పడనుంది. ఇందులో గెలిస్తేనే ఇండియా ట్రోఫీ సొంతం చేసుకుంది. సిరియాకు డ్రా సరిపోతుంది.