గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.100 నుంచే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌)

గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.100 నుంచే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌)
  • కొత్త ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ తెచ్చిన ఈబులియన్  
  • టాప్ క్వాలిటీ ప్రీషియస్‌ మెటల్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయొచ్చంటున్న కంపెనీ

న్యూఢిల్లీ: గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లాటినం, పల్లాడియం వంటి ప్రీషియస్ మెటల్స్‌‌‌‌‌‌‌‌ను ఒకేసారి కొనలేమనుకునేవారు కొద్ది కొద్దిగా కొనుక్కోవడానికి అవకాశం కలిపిస్తోంది ఓ స్టార్టప్‌‌‌‌‌‌‌‌ కంపెనీ.  హిందుస్తాన్‌‌‌‌‌‌‌‌ ప్లాటినం (హెచ్‌‌‌‌‌‌‌‌పీ) సపోర్ట్ ఉన్న ఈబులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ తాజాగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌‌‌‌‌) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్టార్టప్ కంపెనీకి ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ కింద ఇన్వెస్టర్లు గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లాటినం వంటి ప్రీషియస్ మెటల్స్‌‌‌‌‌‌‌‌లో  వారానికి లేదా నెలకొకసారి కనీసం రూ.100 చొప్పున ఇన్వెస్ట్ చేయొచ్చు. 

ఇప్పటి వరకు షేర్లలో సిప్‌‌‌‌‌‌‌‌ చేయడం చూసుంటాం. తాజాగా ప్రీషియస్​ మెటల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా ఇటువంటి అవకాశాన్ని ఈబులియన్ కలిపిస్తోంది. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక స్తోమతకు తగ్గట్టు ఎంత కాలం సిప్  చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చని ఈ బులియన్ వెల్లడించింది. కనీసం రూ. 100 నుంచే సిప్ చేయడానికి అవకాశం కలిపిస్తున్నామని తెలిపింది. ఇన్వెస్టర్లు 3 నెలల నుంచి రెండేళ్ల  టెన్యూర్ వరకు సిప్ చేయొచ్చు. ఈ బులియన్  ప్రీషియస్​ మెటల్స్‌‌‌‌‌‌‌‌ను తయారీ, రిఫైన్ చేస్తోంది. ఈ కంపెనీకి  50 దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. తాజాగా ఇండియాలో అడుగు పెట్టింది. 

9999 ప్యూరిటీ..

లండన్‌‌‌‌‌‌‌‌ బులియన్ మార్కెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతున్న  రిఫైనర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి  ప్రీషియస్​ మెటల్స్‌‌‌‌‌‌‌‌ను సేకరిస్తున్నామని ఈబులియన్ పేర్కొంది. గోల్డ్‌‌‌‌‌‌‌‌ కనీస ప్యూరిటీ  9999, ప్లాటినం లేదా  పల్లాడియం 9995, సిల్వర్‌‌‌‌‌‌‌‌ ప్యూరిటీ  999 ఉంటుందని వెల్లడించింది. సిప్‌‌‌‌‌‌‌‌లను ఈజీగా చేయడానికి వివిధ పేమెంట్ విధానాలు (నెట్‌‌‌‌‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌, యూపీఐ) అందుబాటులో ఉన్నాయి.  ‘టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 2 సిటీలపై   ముఖ్యంగా మిలినియల్స్ (మిడిల్ ఏజ్‌‌‌‌‌‌‌‌)  ను ఆకర్షించడంపై మా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌ ఫోకస్ పెట్టింది. 

యునిక్‌‌‌‌‌‌‌‌గా ఉండి చిన్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు అవకాశం కలిపించే స్కీమ్‌‌‌‌‌‌‌‌ల కోసం ఈ ఏజ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ వారు చూస్తున్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో గ్రామీణ ప్రాంతాల్లోని ఇన్వెస్టర్లు కూడా  ప్రీషియస్​ మెటల్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసేలా స్కీమ్స్ తీసుకొస్తాం. తమ పోర్టుఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలనుకునే సీనియర్ ఇన్వెస్టర్లను కూడా ఈ బులియన్ వెల్‌‌‌‌‌‌‌‌కమ్ చెబుతోంది. డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌కు  సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా మా స్ట్రాటజిక్ రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్ ఉంది’ అని కంపెనీకి చెందిన  రాజీవ్ ఎం రంజన్‌‌‌‌‌‌‌‌ అన్నారు.