వరుసగా వారం పాటు సాగే నోబెల్ ప్రైజ్‌ల ప్రకటనలో రెండో రోజు ముగ్గురిని అదృష్టం వరించింది. తొలి రోజు (నిన్న) వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రం (ఫిజిక్స్)లో ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. స్యుకురో మనాబే, క్లౌస్ హసిల్‌మెన్, జార్జియో పరీసీలకు ఫిజిక్స్ నోబెల్ లభించింది. కాంప్లెక్స్ ఫిజికల్ సిస్టమ్స్‌ను అర్థం చేసుకోవడంలో ఈ ముగ్గురు సైంటిస్టులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 5, 2021
The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5
స్యుకురో మనాబే.. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో సీనియర్ మెటెరోలజిస్ట్‌గా పని చేస్తున్నారు. కార్బన్‌డై ఆక్సైడ్ కారణంగా వాతావరణంలో వేడి, భూతాపం పెరగడం వెనుక ఉన్న లాజిక్‌ను ఆయన కనిపెట్టారు. మరో శాస్త్రవేత్త క్లౌస్.. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెటెరోలజీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వెదర్, క్లైమెట్ మోడల్స్ లింక్ చేస్తూ వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడం ఎలా అన్నదానిపై ఆయన థియరీ రూపొందించారు. ఇక మూడో శాస్త్రవేత్త జార్జియో పరీసీ.. ఇటలీలోని సపీన్‌జా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన డిజార్డర్డ్ కాంప్లెక్స్ మెటీరియల్స్‌లోని మిస్టరీ ప్యాట్రన్స్‌ను కనిపెట్టారు.