మహబూబ్ నగర్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ఖర్చుతో ఇంటింటికి ఇంటర్నెట్

మహబూబ్ నగర్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ఖర్చుతో ఇంటింటికి ఇంటర్నెట్

మద్దూరు,వెలుగు : ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఇంటింటికి ఇంటర్నెట్  అందించేందుకు టీ ఫైబర్  పేరుతో ప్రభుత్వం కొత్త స్కీమ్​ ప్రారంభించిందని పీఎసీఎస్  చైర్మన్  నర్సింలు, ఎంపీడీవో నరసింహా రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపీడీవో మీటింగ్ హాల్ లో టీ ఫైబర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 83 లక్షల ఇండ్లకు రూ.300 ఫైబర్  కనెక్షన్  ఇవ్వబోతోందని

ఇల్లు, ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థలను ఆప్టికల్  ఫైబర్  ద్వారా అనుసంధానం చేయనున్నారని తెలిపారు. తక్కువ ధరతో ఇంటర్నెట్, కేబుల్  టీవీతో పాటు రక్షణ సేవలు, స్టూడెంట్ల కోసం ఈ ఎడ్యుకేషన్  సేవలను అందించనున్నట్లు చెప్పారు. మహిపాల్, స్థానికులు పాల్గొన్నారు.