ఫండింగ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన టీ–హబ్​

ఫండింగ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన టీ–హబ్​

హైదరాబాద్​, వెలుగు: స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ–హబ్  సిడ్బీతో కలసి స్టార్టప్​ల కోసం ఫండింగ్ ప్రోగ్రామ్​ను మొదలుపెట్టింది. దీనివల్ల దేశీయ, రక్షణ  అంతరిక్ష రంగ స్టార్టప్​లకు గణనీయమైన ప్రోత్సాహం దక్కుతుందని తెలిపింది.  ఐఎస్​బీ, కవచ్​, ఇంటర్నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ అండ్​ రీసెర్చ్, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్​ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్-(ఇజ్రాయెల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ , కాలిన్స్ ఏరోస్పేస్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి సంస్థలతో టీ–హబ్ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. 

 దీనివల్ల రక్షణ,  ఏరోస్పేస్ రంగాలలో ఆవిష్కరణల కోసం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని  తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన సిడ్బీ–టీ–-హబ్ ఫండింగ్ ప్రోగ్రామ్ ఈ రంగాలలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సాయపడుతుంది.