బ్రెజిల్​ గోయాస్ ​హబ్​తో టీహబ్​ ఒప్పందం

బ్రెజిల్​ గోయాస్ ​హబ్​తో టీహబ్​ ఒప్పందం
  • మన స్టార్టప్​లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో ఏర్పాటు చేసే స్టార్టప్​లకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించేలా, వాటి అభివృద్ధికి తోడ్పడేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకున్నది. బ్రెజిల్​కు చెందిన గోయాస్ ​హబ్​తో టీహబ్​ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. మంగళవారం హెచ్​ఐసీసీలో గోయాస్​ హబ్​ ప్రతినిధులతో సీఎం రేవంత్​ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంవోయూపై టీహబ్​ సీఈవో సుజిత్​, గోయాస్​ స్టేట్​ సైన్స్​ టెక్నాలజీ అండ్​ ఇన్నొవేషన్​ సెక్రరీ జోస్​ ప్రెడరికో లైరా నెట్టో సంతకాలు చేశారు.

 ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని స్టార్టప్​లకు బ్రెజిల్​లో అవకాశాలు దక్కనున్నాయి. అలాగే బ్రెజిల్​కు చెందిన స్టార్టప్​లకు మన రాష్ట్రంలో అవకాశాలు కల్పించనున్నారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్​కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారాన్ని అందించుకోనున్నాయి. మార్కెట్ యాక్సెస్ తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.