హైడ్రా, మూసీ ప్రక్షాళన మహా యజ్ఞం లాంటివి: టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైడ్రా, మూసీ ప్రక్షాళన మహా యజ్ఞం లాంటివి: టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ : హైడ్రా , మూసి ప్రక్షాళన  మహా యజ్ఞం లాంటివి.. అవి ఆగబోవని  టీ పీసీసీ  చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు.  హైడ్రా జిల్లాలకు విస్తరిస్తామని..  ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు .. మాట తప్పారని చెప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గడంతో ఆయనపై గౌరవం తగ్గిందన్నారు మహేశ్ కుమార్.  మూసీ సుందరీకరణపై డీపీఆర్ సిద్ధం కాలేదు అపుడే  నిధులు ఎలా మల్లిస్తారని ప్రశ్నించారు.  కేటీఆర్ అమెరికాలో చదివాడా లేదా సర్టిఫికెట్ కొన్నాడా..? అని ఎద్దేవా చేశారు.  

కేటీఆర్ పై కోపంతోనే మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.. పీసీసీ సూచనతో  ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని చెప్పారు.  త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ ఉంటుందన్నారు మహేశ్ కుమార్ గౌడ్.  రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్ జిల్లాకు త్వరలో చోటు దక్కుతుందన్నారు.