మూసీలో ఇప్పటి వరకు ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదు : టీ పీసీసీ చీఫ్

మూసీలో  ఇప్పటి వరకు ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదు : టీ పీసీసీ చీఫ్

వరదల నివారణకే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.   గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ ఎక్కడిక్కడ స్తంభిస్తుందన్నారు. హైదరాబాద్ భవిష్యత్ కోసమే తాము ముందుకెళ్తున్నామని చెప్పారు.  వయోనాడ్ పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దన్నారు. వరదలు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మహేశ్ కుమార్ గౌడ్.

గ్లోబల్ వార్మింగ్ గురించి బీఆర్ఎస్ నేతలకు ఆలోచన లేదన్నారు మహేశ్ కుమార్ గౌడ్. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ మేనిఫేస్టోలో లేదా?..ఇపుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.  ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తే హైడ్రా ఉందన్నారు. మూసీలో ఇప్పటి వరకు పేదల గుడిసెలు ఒక్కటి కూడా కూల్చలేదని చెప్పారు.  మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. హైడ్రను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆక్రమణలను తొలగిస్తే తప్ప హైదరాబాద్ కు సేఫ్టీ లేదన్నారు మహేశ్ కుమార్ గౌడ్.ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే  ప్రభుత్వ లక్ష్యం.. పేదోడు కష్టాల్లో ఉంటే  అండగా ఉండే పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు.

ALSO READ | సంతోషంగా లేము.. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు అసంతృప్తి..

తాము ధీర్ఘకాలిక ఆలోచనలతో ముందుకెళ్తున్నామన్నారు మహేశ్ కుమార్ గౌడ్. ప్రభుత్వ చర్యలకు  90 శాతం మంది సపోర్ట్ ఉందన్నారు. హైదరాబాద్ కు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు మహేశ్ కుమార్.  మీ ఫాంహౌస్లు అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టేనా అని ప్రశ్నించారు.  కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అరాచక పాలన అందరికి తెలుసన్నారు మహేశ్ కుమార్. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు తప్పుడు  ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.