నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మిస్తున్న నాలుగు కోర్టు బిల్డింగ్ పనులను స్పీడప్ చేయాలని హైకోర్టు జడ్జిలు టి.వినోద్ కుమార్, లక్ష్మణ్, జిల్లా ఫోర్ట్ పోలియో జడ్జి సుధా అధికారులకు సూచించారు. ఆదివారం కోర్టు భవాన్ని పరిశీలించి.. పలు సూచనలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జిలకు జిల్లా ప్రధాన జడ్జి నాగరాజు, అడిషనల్ జడ్జిలు జయరాజు, తిరుపతి, సంపూర్ణ, ఆనంద్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఎస్పీ అపూర్వ రావు స్వాగతం పలికారు.
అనంతరం వారు మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని, కోర్టు ప్రాంగణంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు రిజిస్టార్ ఎన్.నర్సింగరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేతి రఘుపతి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాంతంగి వీరబాబు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.