ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. బ్యాటర్లు అందరూ ఒకరి వెంట మరొకరు పెవిలియన్ చేరుతున్న వేళ ఓ ఆసీస్ బౌలర్ మెరుపు సెంచరీ బాదాడు. అది కూడా కేవలం 34 బంతుల్లోనే చేయడం గమనార్హం. సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అబాట్.. కెంట్‌తో జరిగిన మ్యాచులో ఈ ఘనత సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం ఆసీస్‌కు చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సర్రే 94 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన అబాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 4 బౌండరీలు, 11 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. అతనికి జోర్డాన్ క్లార్క్(29) మంచి సహకారం అందించాడు. అబాట్ ధాటికి సర్రే నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 223 చేసింది.
అనంతరం 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు కెంట్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు ముయేయే (59), బెల్ డ్రమ్మండ్ (52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి మంచి శుభారంభం అందించారు. అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు త్వరత్వరగా పెవిలియన్చేరడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలా 2 వికెట్లు తీసుకోగా.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు.
https://twitter.com/VitalityBlast/status/1662202624458850304