- గెలిస్తే సూపర్–8 రౌండ్‌క రోహిత్‌సేన
న్యూయార్క్: టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా సూపర్-8 బెర్తుపై కన్నేసింది. బుధవారం జరిగే గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. ఈ పోరులో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో టోర్నీలో ముందంజ వేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్లపైనే అందరి దృష్టి ఉంది. గత రెండు లో స్కోరింగ్ మ్యాచ్‌ల్లో రోహిత్ సేన ఐర్లాండ్, పాకిస్తాన్‌పై గెలిచినా.. బ్యాటింగ్‌లో తడబడింది. రెండింటిలోనూ బౌలర్ల ప్రతిభతోనే విజయం అందుకుంది.
న్యూయార్క్‌లోని డ్రాప్ ఇన్ వికెట్లపై ఇండియా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. సూపర్–8 రౌండ్‌లో బలమైన జట్లతో పోటీ ఉండనున్న నేపథ్యంలో బ్యాటర్లు ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికాను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి లేదు. మన దేశానికే చెందిన మెజారిటీ ఆటగాళ్లు ఉన్న యూఎస్‌ఏ టీమ్ మినీ ఇండియాను తలపిస్తోంది. పైగా ఆ టీమ్ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీద ఉన్నది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఎలాంటి తప్పిదానికి తావివ్వకుండా ఆడాల్సిన అవసరం ఉంది.
యశస్వికి చాన్స్.. వన్‌డౌన్‌కు కోహ్లీ!
గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. ఐపీఎల్‌కు కొనసాగింపుగా మెగా టోర్నీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 4 స్కోర్లతో నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో తనకు అలవాటైన, మంచి రికార్డున్న వన్ డౌన్‌కు తిరిగి వెళ్తే ప్రయోజనం ఉండొచ్చు. అప్పుడు రోహిత్‌కు తోడు ఓపెనర్‌గా యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్‌కు చాన్స్ ఇవ్వొచ్చు. అతని కోసం మిడిలార్డర్‌లో ప్రభావం చూపలేకపోతున్న శివం దూబేను పక్కనబెట్టే అవకాశం ఉంది. పాక్‌పై 28 రన్స్ తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.
ఇదే తడబాటును కొనసాగిస్తే జట్టుకు ఇబ్బంది తప్పదు. గత రెండు మ్యాచ్ ల్లో ఇండియా ఛేజింగ్ చేసింది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మంచి టార్గెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకు ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ నుంచి సపోర్ట్ కావాలి. సూర్యకుమార్ కూడా తక్షణం ఫామ్ అందుకోవాలి. పంత్ ఫామ్‌లో ఉండగా హార్దిక్, జడేజా సైతం బ్యాట్‌తో మెప్పించాలి. బౌలింగ్‌లో ఇండియా బలంగా ఉంది.
రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా కీలకం కానున్నాడు. అయితే, అతనికి తోడు సిరాజ్, అర్ష్‌దీప్ మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. పిచ్ స్వభావం దృష్ట్యా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా కుల్దీప్, చహల్‌లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాన్ని కెప్టెన్, కోచ్ పరిశీలించవచ్చు. ఓపెనర్‌గా జైస్వాల్‌కు చాన్స్ ఇచ్చినా.. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకున్నా దూబే బెంచ్‌పైకి వెళ్లనున్నాడు.
టీమిండియాతో మినీ ఇండియా పోరు
పేరుకే అమెరికా అయినా మన దేశ సంతతికి చెందిన క్రికెటర్లతో ఆతిథ్య జట్టు మినీ ఇండియా టీమ్‌ను తలపిస్తోంది. ఎనిమిది మంది ఇండియన్స్, ఇద్దరు పాకిస్తానీలు, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌కు చెందిన ఒక్కో ఆటగాడు అమెరికాకు ఆడుతున్నారు. టీమిండియాకు ఆడాలన్న తమ కలను నెరవేర్చుకోలేకపోయిన పలువురు ఆటగాళ్లు యూఎస్ జట్టులో చేరి పేరు తెచ్చుకున్నారు.
ఇండియాతో ఏదో రకంగా సంబంధం ఉన్న సౌరభ్ నేత్రవాల్కర్, హర్మీత్ సింగ్, కెప్టెన్ మొనాంక్ పటేల్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగె ఇప్పుడు రోహిత్, విరాట్, బుమ్రా, పంత్ వంటి వరల్డ్ బెస్ట్ క్రికెటర్లతో పోటీకి రెడీ అయ్యారు. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో పాకిస్తాన్ పని పట్టిన నేపథ్యంలో ఇండియాను కూడా ఓడిస్తే యూఎస్‌ఏ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం చేరుతుంది.
బ్యాటింగ్‌లో మొనాంక్, ఆరోన్ జోన్స్, ఆండ్రిస్ గౌస్, హర్మీత్ ఫామ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో కెనడాపై భారీ టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేశారు. అయితే, బుమ్రా, సిరాజ్, జడేజా వంటి బౌలర్లను వీళ్లు ఏమేరకు ఎదుర్కొంటారో చూడాలి. నేత్రవాల్కర్, నోష్తుష్, అలీ ఖాన్ రూపంలో యూఎస్ టీమ్‌లో మంచి బౌలర్లు ఉన్నారు. కానీ, ఇండియా వరల్డ్ క్లాస్ బ్యాటర్లను వీళ్లు ఎలా అడ్డుకుంటారన్నది ఆసక్తికరం.
జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, పంత్ (కీపర్), సూర్యకుమార్, దూబే/యశస్వి/కుల్దీప్, పాండ్యా, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్
అమెరికా: స్టీవెన్ టేలర్, మొనాంక్ (కెప్టెన్, కీపర్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్, జస్దీప్ సింగ్, నోస్తుష్ , సౌరభ్ నేత్రవాల్కర్, అలీ ఖాన్.