IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

2025, జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

ఏడాది క్రితం భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ సమయంలో గాయపడి జట్టుకు దూరమైన భారత పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్ ద్వారా తిరిగొచ్చాడు. మరో 15 రోజుల్లో ఛాంపియన్స్ టోపీ ప్రారంభం కానున్న నేపథ్యంలో షమీకి ఈ సిరీస్ అగ్నపరీక్ష కానుంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు:  సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ , వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).

భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • జనవరి 22: తొలి టీ20 (కోల్ కతా)
  • జనవరి 25: రెండో టీ20 (చెన్నై)
  • జనవరి 28: మూడో టీ20 (రాజ్ కోట్)
  • జనవరి 31: నాలుగో టీ20 (పుణె)
  • ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై)

టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

వన్డే సిరీస్ షెడ్యూల్

  • ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్ పూర్)
     
  • ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్)
  • ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్)