టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 పోరుకు ముందు భారత క్రికెటర్లు మంచి హుషారుగా కనిపిస్తున్నారు. చొక్కాలు విప్పేసి బీచ్ వెంట వాలీబాల్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. సూపర్-8 మ్యాచ్‌ల కోసం బార్బడోస్ చేరుకున్న భారత ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
లీగ్ దశలో కెనడాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. తొలిపోరులో ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన టీమిండియా.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అనంతరం ఆతిథ్య జట్టు అమెరికాను మట్టికరిపించి హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కి అర్హత సాధించింది. సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్ని మ్యాచ్‌లు వెస్టిండీస్ వేదికగా జరగనుండడంతో భారత జట్టు బార్బడోస్ చేరుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ బీచ్ వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.
కోహ్లీ నాయకత్వం
సహాయక సిబ్బంది సహా భారత ఆటగాళ్లు అందరూ రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడారు. ఒక జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించగా.. మరో టీమ్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. ఆట.. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని హైలైట్ చేసింది. వీడియోలో కోహ్లీ, రింకూ, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ వంటి సుపరిచిత ముఖాలు కనిపిస్తున్నాయి.
📍 Barbados
— BCCI (@BCCI) June 17, 2024
Unwinding at the beach 🌊, the #TeamIndia way! #T20WorldCup pic.twitter.com/4GGHh0tAqg
టీమిండియా సూపర్-8 షెడ్యూల్
టీమిండియా సూపర్ 8 తొలి పోరులో జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.
- జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో
- జూన్ 22న బంగ్లాదేశ్‌తో
- జూన్ 24న ఆస్ట్రేలియాతో